సిక్కింలో తొలి కరోనా కేసు నమోదు
- దేశంలో కరోనా ప్రభావం మొదలై మూడు నెలలు
- ఫిబ్రవరిలోనే టూరిస్టుల రాకపై సిక్కింలో నిషేధం
- సీఎం ప్రేమ్ సింగ్ ఆధ్వర్యంలో విజయవంతంగా కరోనా కట్టడి
కరోనా వైరస్ భూతాన్ని నియంత్రించేందుకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించి రేపటికి రెండు నెలలు. దేశంలో కరోనా ప్రభావం మొదలై మూడు నెలలు. ఈ నేపథ్యంలో, ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేకుండా నెట్టుకొచ్చిన సిక్కిం ఇవాళ మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు చేసింది. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్ష నిర్వహించారు. సిక్కింలో ఇప్పటివరకు కరోనా పరీక్ష కేంద్రాలు కూడా లేవు.
సిక్కిం... చైనా, భూటాన్ లతో సరిహద్దులు కలిగివుంది. అయినప్పటికీ ఇప్పటివరకు కరోనా ముప్పు నుంచి సమర్థంగా కాచుకుందని చెప్పాలి. ఓవైపు మిగతా రాష్ట్రాలు వేల సంఖ్యలో కేసులతో సతమతమవుతున్నా, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కఠిన చర్యలతో కరోనాను దూరంగా ఉంచారు. ఫిబ్రవరిలోనే సిక్కింకు టూరిస్టుల రాకను నిలిఫైవేయడమే కాదు, అక్టోబరు వరకు బయటి నుంచి ఒక్కరిని కూడా రాష్ట్రంలోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు.