ఇదిగో గిఫ్టు... నువ్వు చూసి అందరికీ రిలీజ్ చేసేయ్!: నితిన్ కు రిప్లై ఇచ్చిన సాయితేజ్

  • నితిన్, సాయితేజ్ మధ్య ఆసక్తికర సంభాషణ
  • గిఫ్టు ఎప్పుడో పంపేశానన్న సాయితేజ్
  • సోమవారం రిలీజ్ చేసేయ్ అంటూ ట్వీట్
ఎప్పుడో ఇస్తానన్న గిఫ్టు ఇప్పటివరకు ఇవ్వలేదంటూ హీరో నితిన్ మెగా హీరో సాయితేజ్ పై చిరుకోపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దీనికి సాయితేజ్ కొద్ది వ్యవధిలోనే బదులిచ్చాడు. నేనెప్పుడో గిఫ్టు పంపించా నితిన్ డార్లింగ్ అంటూ ట్వీట్ చేశాడు.

"ఆ గిఫ్టు నీ వద్దకు సోమవారం వస్తుంది. మీ వాళ్లందరూ నువ్వెప్పుడు రిలీజ్ చేస్తావా అని ఎదురు చూస్తున్నారు. నువ్వు ఆ గిఫ్టు చూసి రిలీజ్ చేసేయ్! ఇది మా బ్రహ్మచారుల నుంచి మీకు పంపిస్తున్న కానుక. అవునమ్మా, ఇది పాటే... చూసి రిలీజ్ చేసేది నువ్వే!" అంటూ గిఫ్టుపై నెలకొన్న సస్పెన్స్ ను తొలగించాడు.

ప్రస్తుతం సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు నితిన్ కు పంపిన గిఫ్టు, నితిన్ రిలీజ్ చేయబోయే సాంగ్ ఈ చిత్రంలోని పాటే. సుబ్బు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఎల్లుండి సోమవారం ఉదయం 10 గంటలకు ఈ చిత్రం నుంచి 'నా పెళ్లి' అంటూ సాగే ఈ పాటను నితిన్ లాంచ్ చేస్తాడని సాయితేజ్ ట్వీట్ ద్వారా అర్థమవుతోంది.




More Telugu News