బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ వర్ల రామయ్య
- హైకోర్టు తీర్పులు చంద్రబాబుకి ముందుగానే తెలుస్తున్నాయన్నారు
- ఇలా మాట్లాడటం కోర్టు ధిక్కారం కాదా?
- వైసీపీ నేతలు న్యాయస్థానాలను కించపరుస్తున్నారు
- నందిగం సురేశ్‌కి చిన్న విషయాలపై కూడా కనీస అవగాహనలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార శైలిపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైకోర్టు తీర్పులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ముందుగానే తెలుస్తున్నాయంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఆయన అన్నారు. ఏపీ హైకోర్టులో ఇచ్చే తీర్పులన్నీ చంద్రబాబుకు ముందుగానే తెలుస్తాయని నందిగం సురేశ్ మాట్లాడటం కోర్టు ధిక్కారం కాదా? అని వర్ల రామయ్య నిలదీశారు.
వైసీపీ నేతలు న్యాయస్థానాలను కించపరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. నందిగం సురేశ్‌కి చిన్న విషయాలపై కూడా కనీస అవగాహన కూడా లేనట్లుందని, ఆయన న్యూస్ పేపర్ కూడా చదవలేరని బయటవారు చెబుతున్నారని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎంపీ అయినంత మాత్రాన సురేశ్ ఇలా న్యాయస్థానాలపై వ్యాఖ్యలు చేయకూడదని ఆయన హితవు పలికారు.