కూలీలపై రసాయనాల పిచికారీ.. పొరపాటున జరిగిందన్న సిబ్బంది.. వీడియో ఇదిగో
- ఢిల్లీలో ఘటన.. తీవ్ర విమర్శలు
- శ్రామిక్ రైలులో కూలీలు చేరుకున్నాక ఘటన
- కరోనా పరీక్షల కోసం ఎదురుచూస్తుండగా స్ప్రే
న్యూఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్య పరీక్షల కోసం నిలుచున్న కూలీలపై సిబ్బంది రసాయనాలు పిచికారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
శ్రామిక్ రైలులో ప్రయాణించిన వందలాది మంది కూలీలు ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ బడి వద్దకు చేరుకున్నారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి రోడ్ల పక్కన రసాయనాలు పిచికారీ చేస్తోన్న సిబ్బంది, కూలీలపై కూడా స్ప్రే చేశారు. దీనిపై స్పందించిన అధికారులు పొరపాటున కూలీలపై స్ప్రే చేశారని చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లోనూ కూలీలపై స్ప్రే చేయడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి.