తెలంగాణలో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్... నేడు ముగ్గురి మృత్యువాత
- 48కి పెరిగిన మరణాలు
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,761
- 1,043 మంది డిశ్చార్జి
తెలంగాణలో కొన్నివారాల కింద ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు! కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగే రీతిలో కరోనా కేసులు రావడంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని అందరూ భావించారు. అయితే ఆశ్చర్యకరంగా కరోనా తీవ్రత పెరిగింది. నిత్యం పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.
ఇక ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 62 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 42 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు వెలుగు చూడగా, 19 మంది వలస కార్మికులకు కూడా కరోనా సోకినట్టు తేలింది. నేడు మరో మూడు మరణాలు సంభవించగా. మొత్తం మృతుల సంఖ్య 48కి పెరిగింది. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 1,761 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కోలుకున్న వారి సంఖ్య 1,043గా నమోదైంది. ఇవాళ ఏడుగురు డిశ్చార్జి కాగా, ఇంకా 670 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.