ట్రంప్ మాస్క్ ఎందుకు ధరించరు... అధ్యక్షుల వారి సమాధానం ఇదిగో!
- మిచిగాన్ లో ఫోర్డ్ కంపెనీని సందర్శించిన ట్రంప్
- కాసేపు మాస్క్ ధరించి పక్కనపడేసిన వైనం
- మాస్కులోనూ అందంగానే ఉన్నానంటూ చమత్కారం
కరోనా ప్రభావంతో యావత్ ప్రపంచం మాస్కు ధరించినా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మాస్కు లేకుండానే దర్శనమిస్తుంటారు. అయితే, మిచిగాన్ లో ఫోర్డ్ కార్ల కంపెనీని సందర్శించిన సమయంలో కొద్ది సమయం పాటు మాస్కు ధరించారు. ఆపై తీసి పక్కనపడేశారు. దీనిపై ఓ మీడియా ప్రతినిధి ట్రంప్ ను ప్రశ్నించారు. "మీరు మాస్క్ ధరించడాన్ని ఎందుకు ఇష్టపడరు?" అని అడిగాడు.
"ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం సురక్షితంగా ఉన్నప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న అందరికీ కరోనా టెస్టులు చేశారు. ఇక, ఫోర్డ్ కంపెనీ సందర్శనలో నాకు ఓ మాస్క్ ఇచ్చారు. దాన్ని నేను కాసేపు మాత్రమే ధరించాను. నేను మాస్క్ ధరించి ఉండగా చూసే భాగ్యాన్ని మీడియా వాళ్లకు ఇవ్వదలచుకోలేదు. అయినా నేను మాస్క్ లోనూ చూడముచ్చటగానే ఉన్నట్టు భావిస్తున్నా" అంటూ వ్యాఖ్యానించారు.