హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగుల కోసం రేపటి నుంచి ప్రత్యేక బస్సులు

  • హైదరాబాదులో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • సిటీ బస్సులను అనుమతించని వైనం
  • ఉద్యోగుల కోసం 32 రూట్లలో తిరగనున్న ప్రత్యేక బస్సులు
హైదరాబాదులో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో సిటీ బస్సులకు, మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వలేదు. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం హైదరాబాదులో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఈ బస్సులు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాదులోని 32 రూట్లలో ఈ బస్సులు నడపనున్నారు. ఉద్యోగులు ఐడీ కార్డులు చూపిస్తేనే బస్సుల్లోకి అనుమతిస్తారు.


More Telugu News