సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే క్రిమినల్ చర్యలా?: రంగనాయకమ్మ వ్యవహారంపై ఐవైఆర్ వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన రంగనాయకమ్మ
- అభ్యంతరం వ్యక్తం చేసిన సర్కారు
- రంగనాయకమ్మను విచారించిన సీఐడీ
- ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందన్న ఐవైఆర్
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే మహిళపై ఏపీ పోలీసులు చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఆమెకు నోటీసులు పంపిన సీఐడీ పోలీసులు, ఆపై గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో ఆమెను విచారించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.
ఏపీలో సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే క్రిమినల్ చర్యలు తీసుకోవడం చూస్తుంటే ప్రభుత్వం అభద్రతా భావానికి లోనైనట్టు కనిపిస్తోందని, పైగా, ఈ ఘటన ప్రభుత్వ నిరంకుశ ధోరణిని చాటుతోందని ట్వీట్ చేశారు. ఇప్పటి అధికార పక్షం గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇలాంటి అంశంపై నాటి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన విషయం గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు.