ఆర్బీఐ దెబ్బకు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ
  • టర్మ్ లోన్లపై మారటోరియం పొడిగింపు
  • 260 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ముగించాయి. మూడు సెషన్ల నుంచి లాభాలను మూటకట్టుకున్న మార్కెట్లపై ఆర్బీఐ ప్రకటన ప్రభావం చూపింది. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీనికి తోడు టర్మ్ లోన్లపై మారటోరియంను మరో మూడు నెలల పాటు పొడిగించడంతో... బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 260 పాయింట్లు నష్టపోయి 30,672కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 9,039 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.46%), ఇన్ఫోసిస్ (3.01%), ఏసియన్ పెయింట్స్ (2.72%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.90%), టెక్ మహీంద్రా (1.88%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-5.65%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-4.99%), బజాజ్ ఫైనాన్స్ (-4.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (-4.32%), బజాజ్ ఆటో (-3.28%).


More Telugu News