సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన నటుడు ఉత్తేజ్
- అనారోగ్యంతో ఉన్న మాట నిజమే
- రేపు సాయంత్రం ఆపరేషన్ జరుగుతుంది
- ఉదయం చిరంజీవి గారు మాట్లాడారు
టాలీవుడ్ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న అశోక్ తేజ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేపు ఆయనకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో అశోక్ తేజకు బంధువైన సినీ నటుడు ఉత్తేజ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
అశోక్ తేజ్ అనారోగ్యంతో ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని ఉత్తేజ్ తెలిపారు. ఈరోజు ఆయన ఆసుపత్రిలో చేరారని... రేపు సాయంత్రం ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు. సర్జరీ సమయంలో రక్తం అవసరమున్న విషయం వాస్తవమేనని... ఈ విషయంపై తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు ఫోన్ చేశానని... రక్త దాతలను పంపిస్తామని చెప్పారని తెలిపారు. మామయ్య (అశోక్ తేజ) గురించి తెలిసి ఈ ఉదయం చిరంజీవి గారు ఫోన్ చేశారని... మామయ్యతో మాట్లాడి ధైర్యం చెప్పారని అన్నారు.