సోనియా సమావేశానికి గైర్హాజరు కానున్న మూడు కీలక పార్టీలు!
- కాంగ్రెస్ నుంచి 18 పార్టీలకు ఆహ్వానం
- గైర్హాజరవుతున్న ఎస్పీ, బీఎస్పీ, ఆప్
- హాజరవుతున్న వామపక్షాలు, యూపీఏ భాగస్వామ్య పార్టీలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపక్ష పార్టీల సమావేశం జరగనుంది. అయితే, ఈ సమావేశానికి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, కేజ్రీవాల్ కు చెందిన ఆప్ హాజరుకావడం లేదు.
ఈ వారం ప్రారంభంలో మొత్తం 18 పార్టీలకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వెళ్లింది. కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది. కరోనా వైరస్ ను కేంద్రం హ్యాండిల్ చేస్తున్న విధానం, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, హేమంత్ సొరేన్, శరద్ పవార్ పార్టీలతో పాటు వామపక్షాలు, యూపీఏ భాగస్వామ్య పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి.