'ఎంఫాన్'తో కుదేలైన పశ్చిమ బెంగాల్ కు కేంద్రం రూ.1000 కోట్ల ముందస్తు సాయం

  • పశ్చిమ బెంగాల్ పై పంజా విసిరిన 'ఎంఫాన్' తుపాను
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామన్న ప్రధాని
  • తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు
ఎంఫాన్ తుపాను పశ్చిమ బెంగాల్ పై ప్రళయతాండవం చేసిన సంగతి తెలిసిందే. 72 మంది మరణించగా, లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంట భూములు నీట మునిగాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించింది. పశ్చిమ బెంగాల్ కు రూ.1000 కోట్ల ముందస్తు సాయం అందిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇస్తామని, తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు.


More Telugu News