యూఎస్ నేవీ పైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన తెలుగమ్మాయి!

  • పొన్నూరు దంపతుల కుమార్తె దేవిశ్రీ
  • చిన్న వయసులోనే నేవీలో చేరాలని నిర్ణయం
  • తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలకు
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దొంతినేని శ్రీనివాస్, అనుపమల కుమార్తె దేవిశ్రీ అమెరికాలో నేవల్ ఫైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరోసారి ప్రపంచం ముందుంచారు.

న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలాండ్ లో పుట్టిన దేవిశ్రీ, పదో తరగతిలో ఉన్న సమయంలోనే నేవీలోకి వెళ్లాలని స్ఫూర్తి పొంది, ఆ దిశగా కసరత్తు చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) దేవిశ్రీని ప్రత్యేకంగా అభినందించింది. ఆమె తన భవిష్యత్తులో తన పదవికి వన్నె తెచ్చేలా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని పేర్కొంది.

దేశానికి సేవ చేయాలన్న ఆలోచన తనకు మొదటి నుంచీ ఉండేదని, దాన్నే తల్లిదండ్రులకు చెప్పి, సహకరించాలని కోరాననీ, వారు తన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ప్రోత్సహించారని ఈ సందర్భంగా దేవిశ్రీ వ్యాఖ్యానించారు. వారి ప్రోత్సాహంతోనే తాను ఈ స్థితికి చేరానని అన్నారు.


More Telugu News