వ్యంగ్యంగా అన్నా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది: మరోసారి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • సత్యం వద ధర్మం చర
  • అంటే  నిజం మాట్లాడాలి, న్యాయంగా జీవించాలి అని అర్థం
  • కానీ, ఎవరో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వ్యంగ్యంగా అన్న మాట
  • సత్యం వధించబడింది.. ధర్మం చెరసాల పాలైనది అన్నారు
జనసేన నేత, సినీనటుడు నాగబాబు ఇటీవల గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తన ట్విట్టర్‌ ఖాతాలో ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'సత్యం వద ధర్మం చర.. అంటే (speak the truth.. live the righteous life) నిజం మాట్లాడాలి, న్యాయంగా జీవించాలి అని అర్థం. కానీ, ఎవరో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వ్యంగ్యంగా అన్న మాట.. సత్యం వధించబడింది.. ధర్మం చెరసాల పాలైనది అన్నారు. వ్యంగ్యంగా అన్నా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది' అని నాగబాబు ట్వీట్ చేశారు. తను ఇటీవల చేసిన ట్వీట్‌ను దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


More Telugu News