ఐసీసీ చీఫ్‌గా గంగూలీ వెళ్తానంటే.. నా ఓటు దాదాకే: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్
- గంగూలీకి పెరుగుతున్న మద్దతు
- మొన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ప్రశంసలు
- దాదా ఐసీసీ చీఫ్ అయితే క్రికెట్‌ను పరుగులు పెట్టిస్తాడన్న స్మిత్
బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ప్రశంసలు అందుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. దాదా ఐసీసీ చైర్మన్ అయితే మరింత బాగుంటుందని, ప్రపంచ క్రికెట్‌ను అతడు మరో మెట్టు ఎక్కిస్తాడని చెబుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు.
ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం ఈ నెలలో ముగుస్తుండడంతో గంగూలీ ఆ పదవిని చేపట్టాలని కోరాడు. ఆటగాడిగా బోల్డంత అనుభవం ఉన్న ‘దాదా’కు ప్రపంచ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. సీఎస్ఏ సీఈవో జాక్వెస్ ఫాల్ కూడా స్మిత్ వ్యాఖ్యలకు మద్దతు పలికాడు.
ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభ సమయంలో మనోహర్ పదవీకాలం మరో రెండు నెలలపాటు పొడిగించే అవకాశం ఉంది. అయితే, గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలతో పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఐసీసీ చైర్మన్ గిరీ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ కూడా పోటీపడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్మిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గంగూలీ లాంటి వ్యక్తి ఐసీసీ అధ్యక్ష స్థానంలో ఉంటే చూడడం చాలా గొప్పగా ఉంటుందని స్మిత్ పేర్కొన్నాడు. మోడర్న్ క్రికెట్‌పై దాదాకు అవగాహన ఉందని, అతడు అత్యున్నత స్థానంలో ఆడాడని, అతడంటే అందరికీ గౌరవమని ప్రొటీస్ మాజీ స్కిప్పర్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవెర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ఐసీసీ చైర్మన్ కావడానికి అవసరమైన రాజకీయ నైపుణ్యం గంగూలీకి ఉందని ప్రశంసించాడు.