సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఆ వంటకాన్ని మిస్ అవుతోందట!
- రీమేక్ చేయనున్న సందీప్ రెడ్డి
- 'ఉప్పెన'కు ఓటీటీ నుంచి భారీ ఆఫర్
* ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలలో నటిస్తున్న అందాలభామ పూజా హెగ్డే ఈ లాక్ డౌన్ సమయంలో తనకు బాగా నచ్చిన ఓ ఫుడ్డుని మిస్ అవుతోందట. దాని గురించి చెబుతూ, 'ఈ రంజాన్ మాసంలో హైదరాబాదులో లభ్యమయ్యే హలీం వంటకాన్ని బాగా మిస్ అవుతున్నాను' అంటూ ఈ చిన్నది ట్వీట్ చేసింది.
* మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియం' చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే అవకాశం వుంది. ప్రస్తుతం నిర్మాతలు ఈ విషయంలో ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట.
* లాక్ డౌన్ సమయంలో థియేటర్లు బంద్ కావడంతో విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలకు ఓటీటీ ప్లేయర్స్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రానికి కూడా ఓ ప్రముఖ ఓటీటీ ప్లేయర్ నుంచి 14 కోట్ల వరకు ఆఫర్ వెళ్లిందట. అయితే, చిత్ర నిర్మాణానికి అంతకంటే బాగా ఎక్కువ ఖర్చుపెట్టడం వల్ల తమకు వర్కౌట్ కాదని భావించిన చిత్ర నిర్మాతలు ఆఫర్ ని తిరస్కరించినట్టు సమాచారం.