మేం చెప్పినట్టు చేస్తే రైతులు నష్టపోయే అవకాశమే లేదు: సీఎం కేసీఆర్

  • నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై సీఎం సమీక్ష
  • సమీక్షకు హాజరైన మంత్రులు, అధికారులు
  • ఎక్కడ ఏ పంట ఎప్పుడు వేయాలో ప్రణాళిక ఉందన్న సీఎం
ఇప్పటివరకు రైతులు మూసపద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా ఎంతో నష్టపోయారని, ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు ప్రణాళిక రూపొందించిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు అనే అంశంపై ఇవాళ ప్రగతిభవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, నేల రకాలను పరిగణనలోకి తీసుకుని ఏ సీజన్ లో ఏం పండించాలి, ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలనే విషయాలను శాస్త్రవేత్తలు నిర్ణయించారని, ఏ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందో అగ్రిబిజినెస్ డిపార్ట్ మెంట్ అధికారులు గుర్తించారని, ఈ మేరకు రైతులకు ప్రభుత్వం తగిన సూచనలు అందిస్తుందని కేసీఆర్ చెప్పారు.

ఇక ప్రభుత్వం సూచించిన మేరకు పంటలు పండిస్తే రైతులు నష్టపోయే అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతులు నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచానికి అందించడం ద్వారా లాభాలు గడించాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు.


More Telugu News