సోనూసూద్ సేవలను కొనియాడకుండా ఉండలేకపోయిన అమెరికా చెఫ్.. ఈ విధంగా కృతజ్ఞత తెలిపాడు!
- అమెరికాలో ఉంటున్న ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా వ్యాఖ్యలు
- కొత్త వంటకానికి సోనూ సూద్ సొంత ఊరి పేరు ‘మోగా’ పెట్టానని ట్వీట్
- ఆయన ప్రతిరోజు తమలో స్ఫూర్తిని నింపుతున్నారని వ్యాఖ్య
- ఇప్పట్లో మీకు వండి పెట్టలేను అంటే ట్వీట్
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి ఎన్నో సేవలు అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు సినీనటుడు సోనూ సూద్. ఆయన చేస్తోన్న పనుల గురించి తెలుసుకుని అమెరికాలో ఉంటున్న ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా కృతజ్ఞతను తెలుపుతూ కొత్త వంటకం చేసి దానికి సోనూ సూద్ సొంత ఊరి పేరు ‘మోగా’ అని పేరు పెట్టాడు.
'డియర్ సోనూ సూద్ బాయ్... మీరు ప్రతిరోజు మాలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఇప్పట్లో మీకు వండి పెట్టలేను.. కొత్త డిష్ తయారు చేసి దానికి మీరు పుట్టిన ఊరు మోగాగా పేరు పెడుతున్నాను' అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ హర్షం వ్యక్తం చేశాడు.
ఆ చెఫ్ చేసిన పనికి తన సొంత ఊరు గర్వపడుతుందని చెప్పాడు. కాగా, దేశ వ్యాప్తంగా కాలినడకన ఇళ్లకు వెళుతున్న వారికి సోనూ సూద్ బస్సు సౌకర్యాలు కల్పిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికే ముంబైలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలను పది బస్సుల్లో వారి గ్రామాలకు పంపించాడు. పంజాబ్‌లోని వైద్యులకు వ్యక్తిగత రక్షణ కిట్లు ఇచ్చాడు. ముంబైలో తన హోటల్‌లో వైద్య సిబ్బందికి బస ఏర్పాటు చేశాడు.