ఉరుములు, మెరుపులు, కుంభవృష్టి మధ్య పేలిన ట్రాన్స్ ఫార్మర్... వీడియో ఇదిగో!
- చిగురుటాకులా వణికిన కోల్ కతా
- 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు
- వైరల్ అయిన ట్రాన్స్ ఫార్మర్ పేలుడు వీడియో
ఎంఫాన్ తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్ చిగురుటాకులా వణికిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి, వీచిన పెనుగాలులకు వేల సంఖ్యలో భవనాల అద్దాలు పగిలిపోయాయి. కోల్ కతా నగర వ్యాప్తంగా 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఇదే సమయంలో ఓ బిల్డింగ్ బాల్కనీ నుంచి పేలుతున్న ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్ వీడియోను చిత్రీకరించగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దక్షిణ కోల్ కతాలోని అన్వర్ షా రోడ్ లో ఈ ఘటన జరిగింది. భారీ శబ్దాలు చేస్తూ, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులను వెదజల్లుతూ ట్రాన్స్ ఫార్మర్ పేలింది. ఎంతో మంది ఎంఫాన్ కారణంగా తమకు ఎదురైన అనుభవాలను, దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో, అవి వైరల్ అయ్యాయి. ట్రాన్స్ ఫార్మర్ పేలిన వీడియోను మీరూ చూడవచ్చు.