ఈ అలవాటు జగన్ గారికి అధికారంలోకి వచ్చాక కూడా పోలేదు!: నారా లోకేశ్
- డబ్బు కోసం ప్రజలను పీల్చుకు తినే గత అలవాటు జగన్‌కి ఉంది
- అందుకే ప్రజలు లాక్ డౌన్ కష్టాల్లో ఉన్నా కనికరం లేదు
- గుట్టుగా కరెంటు చార్జీలు పెంచి డబ్బు గుంజుతున్నారు
- పాలన అంటే ప్రజలను కష్టాల నుండి గట్టెక్కించడానికి
విద్యుత్ చార్జీలు పెంచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. 'డబ్బు కోసం ప్రజలను పీల్చుకు తినే గత అలవాటు జగన్ గారికి అధికారంలోకి వచ్చాక కూడా పోలేదు. అందుకే ప్రజలు లాక్ డౌన్ కష్టాల్లో ఉన్నా కూడా గుట్టుగా కరెంటు చార్జీలు పెంచి డబ్బు గుంజుతున్నారు. జగన్ గారూ.. పాలన అంటే ప్రజలను కష్టాల నుండి గట్టెక్కించడానికి, కష్టాల్లోకి నెట్టడానికి కాదు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
'పార్టీ రంగులేయడానికి మీరు చేసిన వృథా ఖర్చుకన్నా 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేస్తే వచ్చే నష్టం ఏమీలేదు. కాబట్టి ఆ పని చేసి ప్రజలను ఆదుకోండి. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలి' అని లోకేశ్ కోరారు.