'దారుణం, హృదయ విదారకం, గుండె తరుక్కుపోతోంది' అంటూ వీడియో పోస్ట్ చేసిన సోమిరెడ్డి
- కూలీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు
- వారి బాధలను పట్టించుకోరా?
- దాతలు వేల కోట్ల రూపాయలు ప్రధాని మోదీకి ఇచ్చారు
- వందల కోట్లు ముఖ్యమంత్రికి విరాళంగా ఇచ్చారు కదా?
'దారుణం, హృదయ విదారకం, గుండె తరుక్కుపోతోంది' అంటూ వలసకూలీల కష్టాల గురించి వీడియో పోస్ట్ చేసి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉపాధి కోసం వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్న కూలీలకు ఆయన నిత్యావసర సరుకులు ఇచ్చారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ... 'కొందరు బిహార్, కొందరు ఒడిశాకు వెళ్లాలని అంటున్నారు. వారి బాధలను పట్టించుకోరా? టూరిస్టు బస్సులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో కూలీలను పంపొచ్చు కదా? దాతలు ప్రభుత్వాలను నమ్మి వేల కోట్ల రూపాయలు ప్రధాని మోదీకి ఇచ్చారు. వందల కోట్లు ముఖ్యమంత్రికి విరాళంగా ఇచ్చారు. అయినప్పటికీ, రోడ్లపై భారత దేశ పౌరులు తిండిలేక అల్లాడిపోతుంటే వారికి సాయం చేయట్లేదు' అంటూ సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'వలస కూలీల బాధలు వర్ణనాతీతం..నరకయాతన పడుతున్న వీరిని సొంతూర్లకు పంపేందుకు వాహనాలు ఏర్పాటు చేయలేరా? మోదీ, జగన్ గారూ. ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం' అని ఆయన పేర్కొన్నారు.