భార్యకు కరోనా సోకిందట.. బయటకొచ్చి వాహనాలకు నిప్పు పెట్టాడు!

  • హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పరిధిలో ఘటన
  • భార్యకు వైరస్ సోకిందన్న బాధ
  • రెండు బైక్‌లు, ఆటోకు నిప్పు
ఉరుమురిమి మంగలం మీద పడడం అంటే ఇదే కాబోలు. భార్యకు కరోనా వైరస్ సోకిందన్న బాధతో ఓ వ్యక్తి ఇంటి బయటకు వచ్చి కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో నివసించే ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. భార్య మహమ్మారి బారినపడడంతో తట్టుకోలేకపోయిన ఆమె భర్త మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి బాపూనగర్‌లో మద్యం తాగాడు. అనంతరం రెండు ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోకు నిప్పుపెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News