షూటింగ్స్ ఎలా? థియేటర్ల సంగతేంటి?.. నేడు చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖుల సమావేశం!

  • లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన చిత్ర పరిశ్రమ
  • నేడు చిరంజీవి ఇంట్లో కీలక భేటీ
  • తెలంగాణ మంత్రి తలసాని హాజరయ్యే అవకాశం
లాక్ డౌన్ కారణంగా అత్యధికంగా నష్టపోయిన రంగాల్లో టూరిజంతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ఉంది. సినిమాల షూటింగ్ లు నిలిచిపోయి, లక్షలాది మంది కార్మికులు వీధిన పడగా, థియేటర్లు రెండు నెలలకు పైగా మూతపడి అపార నష్టాన్ని మిగిల్చాయి. లాక్ డౌన్ నిబంధనల నుంచి ఒక్కో రంగానికి సడలింపులు వస్తున్న తరుణంలో సినీ పరిశ్రమను తిరిగి ఎలా తెరిపించాలన్న విషయమై నేడు కీలక సమావేశం జరగనుంది.

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలు నేడు సమావేశం కానున్నారని తెలుస్తోంది. థియేటర్స్ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం, షూటింగ్స్ ప్రారంభిస్తే, చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదే సమావేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చిరంజీవి ఇంట్లో జరిగే ఈ భేటీలో పలువురు నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు హాజరు కానున్నారని తెలుస్తోంది.


More Telugu News