ఎంఫాన్ పెను తుపానుగా మారడానికి కారణం ఇదే: శాస్త్రవేత్తలు

  • తక్కువ సమయంలోనే కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5కు మారిన తుపాన్ 
  • పర్యావరణ మార్పులే కారణమంటున్న శాస్త్రవేత్తలు
  • 32 నుంచి 34 డిగ్రీలకు చేరుకున్న బంగాళాఖాతం జలాలు
ఎంఫాన్ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ పై విరుచుకుపడింది. బంగ్లాదేశ్ ను అతలాకుతలం చేస్తోంది. 1999 తర్వాత ఒడిశా ఎదుర్కొన్న పెను తుపాను ఇదే కావడం గమనార్హం. ఎంఫాన్ తుపాను ప్రభావానికి ఒకానొక సమయంలో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అయితే తీరం దాటే సమయానికి కొంచెం శాంతించడంతో 160 కిలోమీటర్లకు పరిమితమైంది. లేకపోతే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది.

అయితే ఎంఫాన్ అతి కొద్ది సమయంలోనే కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5 పెను తుపానుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై శాస్త్రవేత్తలు స్పందిస్తూ, పర్యావరణ మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు. సముద్ర జలాలు వేడెక్కుతుండటం వల్లే... ఎంఫాన్ తుపాను పెను తుపానుగా మారిందని అన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. బంగాళాఖాతం జలాల ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీలకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర జలాలు వేడెక్కడం పెను తుపానులకు దారితీస్తుందని చెప్పారు.


More Telugu News