చేపలను హోమ్ డెలివరీ చేయడానికి యాప్.. లాక్ డౌన్ లో ఫుల్ సక్సెస్!

  • చేపల డెలివరీకి యాప్ ప్రారంభించిన బీహార్ ప్రభుత్వం
  • రెండు, మూడు గంటల వ్యవధిలోనే హోమ్ డెలివరీ
  • రోజురోజుకు పాప్యులర్ అవుతున్న యాప్
లాక్ డౌన్ నేపథ్యంలో బీహార్ మత్స్యశాఖ చేసిన ప్రయోగం సఫలమైంది. చేపలను హోమ్ డెలివరీ చేసేందుకు తీసుకొచ్చిన యాప్ సక్సెస్ అయింది. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన రెండు, మూడు గంటల వ్యవధిలోనే ఇంటికి చేపలను డోర్ డెలివరీ చేస్తున్నారు. రోజురోజుకూ ఈ యాప్ పాప్యులర్ అవుతోంది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబడుతోంది.

మరోవైపు ఎలాంటి డెలివరీ ఛార్జీలు లేకపోవడం కూడా జనాలను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా బీహార్ వ్యవసాయ, జంతు, మత్స్య శాఖ మంత్రి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, లాక్ డౌన్ మధ్య యాప్ బాగా పాప్యులర్ అవుతోందని చెప్పారు. ఇదిలావుంచితే, బీహార్ లో కరోనా కేసుల సంఖ్య 1,579కి చేరుకుంది.


More Telugu News