సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేసిన శివాజీ
- కరోనాతో ఆగిపోయిన షూటింగులు
- ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులు
- రూ. 2 లక్షల సాయం చేసిన శివాజీ
కరోనా కారణంగా సినీ పరిశ్రమ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ తదితర పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో, సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. కుటుంబ పోషణ కూడా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ హీరో, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ శివాజీ ముందుకొచ్చారు. తన వంతుగా ఆర్థిక సాయం చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు రూ. 2 లక్షల చెక్ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన శివాజీని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అభినందించింది.