నచ్చేయడంతో ఓకే చెప్పేసిన నాని!

  • కొత్తదనం వున్న కథలను ఎంచుకునే హీరో 
  • నూతన దర్శకుడు శ్రీకాంత్ కు ఛాన్స్ 
  • సెట్స్ మీద 'టక్ జగదీశ్', 'శ్యామ్ సింగ రాయ్' 
నాని మొదటి నుంచీ కూడా సాదాసీదా సినిమాలు చేయలేదు. తను నటించిన ఏ సినిమా చూసినా అందులో ఏదో కాస్త కొత్తదనమైనా కనపడుతుంది. అతని నటనలో కూడా సమ్ థింగ్ స్పెషల్ కనిపిస్తుంది. అందుకే, వెరైటీ పాత్రలు, కథలతో నూతన దర్శకులు వచ్చినా, నచ్చితే కనుక వెంటనే ఓకే చెప్పేస్తాడు.

తాజాగా అలాగే శ్రీకాంత్ ఓడెల అనే కొత్త కుర్రాడికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో సుకుమార్ వద్ద 'రంగస్థలం' చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇటీవల కలసి శ్రీకాంత్ కథ చెప్పగా, అది నానికి బాగా నచ్చేసిందట. కథ కొత్తగా, ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో, వెంటనే మరో మాట లేకుండా ఆ ప్రాజక్టుకి ఓకే చెప్పేశాడని అంటున్నారు.

ఇక ఇందులో హీరో పాత్రను సరికొత్త తరహాలో డిజైన్ చేయడం జరిగిందట. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని నటించిన 'వి' చిత్రం విడుదలకు రెడీగా వుండగా.. 'టక్ జగదీశ్', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలు సెట్స్ పై వున్నాయి. ఇవి పూర్తికాగానే శ్రీకాంత్ దర్శకత్వంలో కమిట్ అయిన చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.


More Telugu News