ఫార్మా అండతో లాభాల్లో దూసుకుపోయిన మార్కెట్లు

  • 622 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 187 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతం వరకు లాభపడ్డ మహీంద్రా అండ్ మహీంద్రా
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో దూసుకుపోయాయి. ఫార్మా, బ్యాంకింగ్, ఆటో షేర్ల అండతో సూచీలు  లాభాల్లో పయనించాయి. ఉదయం నుంచి లాభాల్లోనే పయనించిన సూచీలు... చివరి గంటలో మరిన్ని లాభాలను గడించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 30,818కి ఎగబాకింది. నిఫ్టీ 187 పాయింట్లు పుంజుకుని 9,066కి పెరిగింది. టెలికాం మినహా మిగిలిన సూచీలన్నీ లాభాలను ఆర్జించాయి. ఫార్మా సూచీ నాలుగు శాతం వరకు లాభపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.92%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (5.61%), ఎల్ అండ్ టీ (4.85%), టాటా స్టీల్ (4.17%), బజాజ్ ఫైనాన్స్ (3.85%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.85%), హీరో మోటో కార్ప్ (-2.45%), భారతి ఎయిర్ టెల్ (-0.85%), ఏసియన్ పెయింట్స్ (-0.35%).


More Telugu News