కరోనాతో కుదేలవుతున్న ప్రపంచ దేశాల వృద్ధిరేటు.. భారత్ మాత్రం సేఫ్: సీఆర్‌ఎస్‌

  • ఆసియాలోని  కొన్ని దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కి
  • మొత్తం దాదాపు 26 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి
  • భారత్‌ నుంచే అత్యధికంగా16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి
  • భారత్‌తో పాటు మరో రెండు దేశాల వృద్ధి రేటు మాత్రం పాజిటివ్
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పలు దేశాల నుంచి వెనక్కి వెళ్లిన పెట్టుబడులపై కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌) జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌తో పాటు  ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాల నుంచి మొత్తం దాదాపు 26 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లినట్లు ఆ అధ్యయనంలో తేలింది. అందులో భారత్‌ నుంచే అత్యధికంగా16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.

ఆసియాలో భారీ మాంద్యం తప్పని పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. ఈ పరిస్థితుల్లో భారత్‌తో పాటు మరో రెండు దేశాల వృద్ధి రేటు మాత్రం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉందని చెప్పింది. కరోనా ప్రభావంతో అమెరికాలో 2020 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.8 శాతం తగ్గిందని వెల్లడించింది. జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, స్పెయిన్‌, ఇటలీ వంటి ఐరోపా దేశాల్లో దాదాపు మూడు కోట్ల మంది ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించింది.

యూరోజోన్‌ ప్రాంతంలో 2020 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 3.8 శాతం తగ్గిపోయిందని తెలిపింది. అయితే, చైనా, భారత్‌, ఇండోనేషియాల్లో మాత్రం 2020లో వృద్ధి రేటు పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. ఆయా దేశాల్లో సినిమా, విమానయాన రంగాలు రానున్న కాలంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోనున్నాయని పేర్కొంది.


More Telugu News