సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • ఆ బాధ తీరిందంటున్న పాయల్
  • చిన్నదైనా చాలంటున్న అదితీరావు
  • సుధీర్ వర్మతో బెల్లంకొండ సినిమా
*  ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందాలభామ పాయల్ రాజ్ పుత్ ఓ షార్ట్ ఫిలింలో నటించింది. 'ఎ రైటర్' పేరిట రూపొందిన దీనికి ఆమె స్నేహితుడు సౌరభ్ దర్శకత్వం వహించాడు. దీని గురించి పాయల్ చెబుతూ, 'కేవలం 24 గంటల్లో దీనిని షూట్ చేయడం జరిగింది. లాక్ డౌన్ వల్ల కెమెరా ముందుకు వెళ్లలేదన్న బాధ ఈ షార్ట్ ఫిలింలో నటించడం ద్వారా తీరింది' అని చెప్పింది.  
*  మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తలను కథానాయిక అదితీరావు హైదరీ ఖండించింది. ఈ వార్తల్లో వాస్తవం లేదనీ, తనకు మణి నుంచి ఆఫర్ రాలేదనీ, ఒకవేళ ఆయన చిత్రాలలో చిన్న పాత్ర పోషించే ఛాన్స్ వచ్చినా వదులుకోననీ అదితీరావు చెప్పింది.  
*  యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' చిత్రంలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగింది.


More Telugu News