విశాఖ మంగమారిపేటలో ముందుకు వచ్చిన సముద్రం... మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలన్న అవంతి

  • బంగాళాఖాతంలో ఎమ్ పాన్ తుపాను
  • మంగమారిపేటలో కలకలం
  • తుపాను తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఎమ్ పాన్ తుపాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దిశగా దూసుకుపోతోంది. అయినప్పటికీ ఏపీలోనూ సముద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. కాగా, విశాఖలోని మంగమారిపేటలో సముద్ర అలలు బాగా ముందుకు చొచ్చుకుని రావడం కలకలం రేపింది. పరిస్థితిని మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్షించారు. మంగమారిపేట వెళ్లి మత్స్యకారులను హెచ్చరించారు. తుపాను నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. తుపాను తీరం దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను వేళ బోట్లను తీరానికి దూరంగా తరలించాలని సలహా ఇచ్చారు.


More Telugu News