చైనాలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా... జిలిన్ ప్రావిన్స్ లో లాక్ డౌన్

  • జిలిన్ ప్రావిన్స్ లో 34 కొత్త కేసులు
  • రష్యా నుంచి వచ్చిన వారే కారణమంటున్న అధికారులు
  • రవాణా వ్యవస్థ నిలిపివేత
ప్రపంచవ్యాప్తంగా 213 దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా మహమ్మారి చైనాలో వెలుగు చూసిందన్న సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇతర దేశాలన్నీ కరోనాతో సతమతమవుతున్న దశలో చైనాలో పరిస్థితులు కుదుటపడ్డాయి.

అయితే అది తాత్కాలికమేనని మళ్లీ అక్కడ నమోదవుతున్న కొత్త కేసులు చెబుతున్నాయి. గత కొన్నిరోజులుగా చైనాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. వుహాన్ లోనూ కరోనా క్లస్టర్లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, జిలిన్ ప్రావిన్స్ లో 34 మందికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాంతో ఆ ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించారు. రవాణా వ్యవస్థ నిలిపివేశారు. స్కూళ్లు, ఆఫీసులు మూతపడ్డాయి. రష్యా నుంచి వచ్చిన వారి కారణంగానే కరోనా కేసులు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.


More Telugu News