ఈ నెల 21న సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం
- వ్యవసాయ రంగంపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్
- మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమావేశం
- పంటల మ్యాప్ పై నిర్ణయం
తెలంగాణలో మార్కెట్ ధర పలికే పంటలనే పండించాలంటూ సీఎం కేసీఆర్ రైతులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియంత్రిత పంటల సాగు విధానంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం ముఖ్యులు హాజరుకానున్నారు. జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇదే అంశంపై వ్యవసాయ అధికారులు, అగ్రి యూనివర్సిటీల అధికారులతో నిన్నటి నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఏ జిల్లాలో ఏ పంట వేయాలి? ఏ తరహా విత్తనం నాటాలి? అనే అంశాలతో ఓ మ్యాప్ రూపొందిస్తారు. ఎల్లుండి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ పంటల మ్యాప్ పై ఓ నిర్ణయం తీసుకుంటారు.