సీఐడీ నోటీసులపై రంగనాయకమ్మ స్పందన
- వైసీపీ వ్యతరేక పోస్టులు పెట్టిన వృద్ధురాలు
- కేసు నమోదు చేసిన సీఐడీ
- ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదన్న రంగనాయకమ్మ
ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే ఆరోపణలతో గుంటూరు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన 66 ఏళ్ల వృద్ధురాలు రంగనాయకమ్మపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని తాను ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని చెప్పారు. తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలన్నదే తన కోరిక అని అన్నారు.
రంగనాయకమ్మపై 41-ఏ కింద సీఐడీ నోటీసులు అందజేసింది. నేరం రుజువైతే ఆమెకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు.