ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జూన్ 8కి వాయిదా
- ఇటీవల విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్
- సుప్రీం కోర్టులో వాదనలు విన్న జస్టిస్ లలిత్ ధర్మాసనం
- వాదనలు వినిపించిన ఎల్జీ పాలిమర్స్
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకై 12 మంది మృత్యువాత పడిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మొత్తం 7 విచారణ కమిటీలు వేశారని ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది తెలిపారు. ఎన్జీటీ సహా రాష్ట్ర హైకోర్టు, ఎన్ హెచ్ఆర్ సీ, ఎన్ పీసీబీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీలు ఏర్పాటయ్యాయని వివరించారు.
మే 7న ఘటన జరిగిందని, ఆ మరుసటి రోజే కమిటీలు వేశారని వెల్లడించారు. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేశామని, అంతకుమించి ఎన్జీటీకి విచారణ అధికారం లేదని ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. వాదనలు విన్న జస్టిస్ లలిత్ ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది. అంతేగాకుండా, విచారణాధికారం అంశంపై ఎన్జీటీలో లేవనెత్తే అవకాశాన్ని ఎల్జీ పాలిమర్స్ కు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.