చంద్రగిరి వైసీపీలో కుమ్ములాట.. రెండు కులాల మధ్య ఆధిపత్యపోరు

  • గ్రామంలో సమావేశం పెట్టుకున్న ఓ సామాజికవర్గం
  • తప్పుడు కేసులు పెట్టించిన మరో వర్గానికి చెందిన నేత
  • ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
ఒకే పార్టీలోని నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉండటం సహజమే. కానీ, ఒకే పార్టీలో కులాల మధ్య ఆధిపత్య పోరు ఉండటం అరుదుగా చూస్తుంటాం. ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీలో ఇదే జరుగుతోంది. రెండు కులాల మధ్య వైరం ముదురుతోంది. గ్రామంలో ఉండాలంటే తాము చెప్పినట్టే వినాలని, లేకపోతే గ్రామాన్ని వదిలి వెళ్లాలని ఓ సామాజికవర్గాన్ని మరో వర్గం బెదిరిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే, ఓ సామాజిక వర్గానికి చెందిన వారు గ్రామంలో సమావేశం పెట్టుకున్నారు. ఇది తెలుసుకున్న కొండవాడకు చెందిన చంద్రమౌళిరెడ్డి తమపై తప్పుడు కేసులు పెట్టించారని బాధితులు తెలిపారు. అంతేకాదు, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సోమశేఖర్ యాదవ్ పై సీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని, అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్పీ రమేశ్ రెడ్డికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆడియో ఆధారాలను అందించామని, తమకు న్యాయం చేయాలని కోరామని చెప్పారు.


More Telugu News