హమ్మయ్య! కనిపించిన చిరుత.. బంధించేందుకు కుక్కలను వదిలిన అధికారులు

  • కాటేదాన్ అండర్‌బ్రిడ్జి రోడ్డుపై గాయాలతో చిరుత
  • బంధించేలోపే తప్పించుకున్న వైనం 
  • స్విమ్మింగ్ పూల్‌లో నీళ్లు తాగుతూ కనిపించిన చిరుత 
గత ఐదు రోజులుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల వాసులను భయభ్రాంతులకు గురిచేసిన చిరుత ఆచూకీ ఎట్టకేలకు లభించింది. గండిపేట మండలంలోని హిమాయత్‌సాగర్ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లో ఇది కనిపించింది. అక్కడి స్విమ్మింగ్‌పూల్‌లో చిరుత నీళ్లు తాగుతుండడాన్ని గమనించిన వాచ్‌మన్ వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. స్పందించిన అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను బంధించేందుకు గార్డెన్‌లోకి కుక్కలను వదిలిపెట్టారు. మారోమారు అది తప్పించుకోకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఈ నెల 14న కాటేదాన్ అండర్‌బ్రిడ్జి రోడ్డుపై గాయాలతో ఉన్న ఓ చిరుత కనిపించింది. సమాచారం అందుకున్న అటవీ, జూపార్క్ సిబ్బంది అక్కడికి చేరుకుని బంధించేలోపే తప్పించుకుంది. ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్‌ను గాయపరిచి పక్కనే ఉన్న ఫాం హౌస్‌లోకి వెళ్లి అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ రోజు నుంచి అటవీ అధికారులు దాని కోసం గాలిస్తూనే ఉన్నారు.


More Telugu News