ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్ ల నిర్వహణపై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • క్రీడా పోటీలపై సడలుతున్న ఆంక్షలు
  • ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్ లకు కొన్ని దేశాలు సంసిద్ధత
  • పెద్దగా మజా ఉండదన్న అక్తర్
కరోనా వ్యాప్తి భయంతో ప్రేక్షకులు లేకుండా క్రీడా పోటీలు నిర్వహించడంపై అనేక దేశాల్లో ప్రతిపాదనలు ఉన్నాయి. భారత్ లోనూ ఈ మేరకు వెసులుబాటు కల్పించారు. దీనిపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు జరిపితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు ఏమైనా మేలు జరగొచ్చేమో కానీ, ఆటకు సంబంధించిన మజా ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పెద్దగా విజయవంతం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు లేని స్టేడియం, పెళ్లికూతురు లేని పెళ్లి రెండూ ఒకటేనని అభివర్ణించారు. ప్రేక్షకులతో నిండిన స్టేడియంలే ఆటలకు ప్రోత్సాహాన్నిస్తాయని అక్తర్ అభిప్రాయపడ్డారు.


More Telugu News