ప్రచండ తుపానుగా మారిన 'ఎమ్ పాన్'... ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసిన మోదీ
- బంగాళాఖాతంలో మరింత బలపడిన 'ఎమ్ పాన్'
- పారాదీప్ పట్టణానికి దక్షిణంగా 730 కిమీ దూరంలో కేంద్రీకృతం
- తుపాను పరిస్థితులపై అధికారులతో చర్చించిన మోదీ
బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఎమ్ పాన్' తుపాను భీకర రూపు దాల్చింది. ఈ సాయంత్రానికి మరింత బలపడి ప్రచండ తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పారదీప్ రేవు పట్టణానికి దక్షిణంగా 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ రాకాసి తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం సమీపానికి దూసుకువస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. 'ఎమ్ పాన్' తుపాను పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సన్నద్ధత, ఎన్డీఎమ్ఏ కార్యాచరణ గురించి సంబంధింత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు, క్షేత్రస్థాయిలో 25 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని, మరో 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రధానికి వివరించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు.