లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో.. ఏపీలో ఆలయాల్లోకి భక్తులకు నో ఎంట్రీ
- మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం
- ఏ ఆలయంలోనూ దర్శనాలు లేవని మంత్రి వెల్లంపల్లి వెల్లడి
- నిత్యపూజలు కొనసాగుతున్నాయని వివరణ
కేంద్రం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఏపీలోనూ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో మే 31 వరకు రాష్ట్రంలోని ఏ ఆలయంలోనూ భక్తులను అనుమతించబోమని, ఏపీలోని అన్ని ఆలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి తాము ఇదే విధానం పాటిస్తున్నామని, ఇప్పుడది కొనసాగిస్తున్నామని తెలిపారు. కాగా, ఆర్జిత సేవల కోసం ఆన్ లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని, ఈ మేరకు భక్తులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి వివరించారు. అటు, అన్ని దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.