క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత: చంద్రబాబు
- కరోనా కట్టడిలో భాగంగా క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు
- నాసిరకం భోజనం అందిస్తున్నారంటూ మీడియాలో కథనాలు
- రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే జరుగుతోందన్న చంద్రబాబు
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఏపీలోనూ పెద్ద సంఖ్యలో అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే క్వారంటైన్ కేంద్రాల్లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న ప్రజలకు నాణ్యమైన భోజనం పెట్టడం ప్రభుత్వ కనీస బాధ్యత అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా నేషనల్ మీడియా చానల్లో వచ్చిన ఓ వీడియోను కూడా పంచుకున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన మత్స్యకారులు, వలస కార్మికులు తమకు అధ్వానంగా ఉన్న ఆహారం అందిస్తున్నారంటూ అధికారుల ముందు ఆందోళన చేస్తున్న తీరు ఈ వీడియోలో కనిపిస్తోందని, ఇలాంటి ఘటనలే ఏపీ వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయని ఆరోపించారు.