లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకుంటాం: కేటీఆర్ ప్రకటన
- లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు
- వాటి అమలుపై మాకు చాలా సూచనలు వచ్చాయి
- కేసీఆర్ గారు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు
- అన్ని సూచనలను మేము పరిశీలిస్తాం
కరోనా వైరస్ విజృంభణతో విధించిన లాక్డౌన్లో కేంద్ర ప్రభుత్వం భారీ సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. నేటి నుంచి దేశ వ్యాప్తంగా నాలుగో దశ లాక్డౌన్ అమలవుతుండగా తెలంగాణలో మూడో దశ లాక్డౌన్ ఈ నెల 29 వరకు అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన అంశాలను తెలంగాణలోనూ అమలు చేయడం వంటి పలు కీలక అంశాలపై ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చర్చిస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు.
'లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల అమలుపై మాకు చాలా సూచనలు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇదే అంశంపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. సూచనలను మేము పరిశీలిస్తాం' అని తెలిపారు. సడలింపులపై అందరి సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.