ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను ఇలా...: కేటీఆర్

  • 2015, మే 18న సియాటెల్ లో
  • గుర్తు చేసిన గూగుల్ ఫోటోస్
  • ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్
సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం 2015, మే 18న తాను సియాటెల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు గుర్తు చేసుకున్నారు. గూగుల్ ఫొటోస్ నుంచి వచ్చిన ఓ మెమొరీ స్క్రీన్ షాట్ ను ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.

"గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను. ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను సియాటెల్ లో ఉన్నానని గూగుల్ ఫొటోస్ గుర్తు చేసింది" అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


More Telugu News