ప్రపంచం మొత్తం అలా.. మీరు మాత్రం ఇలా: అఫ్రిదీకి ధవన్ ఘాటు రిప్లై
- కశ్మీర్‌పైనా, మోదీపైనా అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు
- కశ్మీర్‌పై ఏడుస్తున్నారంటూ ధవన్ మండిపాటు
- తమలో ఒక్కొక్కరు లక్ష మందితో సమానమన్న ఓపెనర్
కశ్మీరుపైనా, భారత ప్రధాని నరేంద్రమోదీపైనా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఘాటుగా బదులిచ్చాడు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే మీరు మాత్రం కశ్మీర్‌పై పడి ఏడుస్తున్నారని అన్నాడు. కశ్మీర్ తమదేనని, అది ఎప్పటికీ తమతోనే ఉంటుందని దీటైన జవాబిచ్చాడు. కావాలంటే పాక్‌లోని 22 కోట్ల మందిని తీసుకురావాలని, తమలో ఒక్కొక్కరు లక్షల మందితో సమానమంటూ ధవన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
అఫ్రిది వ్యాఖ్యలకు గౌతం గంభీర్ ఇప్పటికే ఘాటుగా స్పందించాడు. అఫ్రిది 16 ఏళ్ల వృద్ధుడని, పాకిస్థాన్‌లోని ఏడు లక్షల సైన్యానికి 20 కోట్ల మంది ప్రజల మద్దతు ఉందని ఇటీవల అఫ్రిది అన్నాడని, అయినా సరే 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం యాచిస్తున్నారంటూ గంభీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బజ్వాలాంటి జోకర్లు భారత్‌పైనా, మోదీపైనా విషం కక్కుతూనే ఉన్నారని అన్నాడు. ఎంత చేసినా కశ్మీర్‌ను వారెప్పటికీ పొందలేరని పేర్కొన్న గంభీర్.. బంగ్లాదేశ్ గుర్తుందా? అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
హర్భజన్ సింగ్ కూడా అఫ్రిదికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. కరోనాతో అల్లాడుతున్న పాక్‌కు మద్దతు ఇవ్వాలని అఫ్రిది కోరితే తాను, యువరాజ్ సింగ్ మద్దతు ఇచ్చామని, ఇప్పుడతడు భారత్‌పై విషం చిమ్ముతున్నాడని, అతడిని స్నేహితుడిగా పిలిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని హర్భజన్ చెప్పుకొచ్చాడు.