బంగాళాఖాతంలోకి నైరుతి ఋతుపవనాలు... మరిన్ని వర్షాలకు చాన్స్!

  • మరో రెండు రోజుల్లో విస్తరించనున్న రుతుపవనాలు
  • ఎమ్ పాన్ 20న తీరం దాటే అవకాశం
  • హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం
ఆదివారం నాడు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్‌ దీవుల ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవుల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే ఆస్కారం ఉందని వాతావరణ కేంద్రం సీనియర్‌ ఆఫీసర్ రాజారావు వెల్లడించారు.

 ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఎమ్ పాన్' తుపాను కారణంగా మంగళవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక 'ఎమ్ పాన్' మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారి, తొలుత ఉత్తర దిశగా, ఆపై ఉత్తర ఈశాన్య దిశగా వెళ్లి, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య 20వ తేదీ సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉందని రాజారావు అంచనా వేశారు.


More Telugu News