రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్ లో జనరల్ అట్లాంటిక్ సంస్థ భారీ పెట్టుబడి

  • జియోలో అంతర్జాతీయ పెట్టుబడుల వెల్లువ
  • తాజాగా రూ.6,598 కోట్లతో వాటాలు స్వీకరించిన జనరల్ అట్లాంటిక్
  • 1.34 శాతం వాటాలు విక్రయించిన జియో ప్లాట్
భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే జియో ప్లాట్ ఫామ్స్ లో ఫేస్ బుక్, విస్టా ఈక్విటీ, సిల్వర్ లేక్ సంస్థలు భారీగా పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నాయి.

తాజాగా, అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ అనే ఈక్విటీ సంస్థ కూడా జియో ప్లాట్ ఫామ్స్ లో వాటాల కోసం రంగంలోకి దిగింది. జియోలో కేవలం 1.34 శాతం వాటాల కోసం రూ.6,598 కోట్లు చెల్లించింది. గత నాలుగు వారాల వ్యవధిలో జియోలో వాటాలు స్వీకరించిన నాలుగో సంస్థ జనరల్ అట్లాంటిక్. కాగా, అంతర్జాతీయ పెట్టుబడులతో జియో తొణికిసలాడుతోంది. కేవలం ఈ నాలుగు సంస్థల ద్వారానే జియో ప్లాట్ ఫామ్స్ రూ.67,194.75 కోట్లు సమీకరించింది.


More Telugu News