చంద్రబాబు ఎక్కడున్నా పోతిరెడ్డిపాడుపై తన వైఖరి తెలియజేయాలి: మంత్రి అనిల్ కుమార్
- తెలుగురాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం
- టీడీపీ వైఖరి ఇప్పటికీ వెల్లడించలేదన్న అనిల్
- టీడీపీ నేతల మౌనం అనుమానాలు కలిగిస్తోందని వ్యాఖ్యలు
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటి పారుదల ప్రాజెక్టు విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు రేగిన సంగతి తెలిసిందే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు ఏపీ సర్కారు జారీ చేసిన జీవో 203 తెలంగాణ సర్కారును అసహనానికి గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు పోతిరెడ్డిపాడుపై తన వైఖరి వెల్లడించలేదని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడున్నా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తన వైఖరేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు ఈ అంశంలో మౌనంగా ఉండడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మూడు సార్లు అడిగినా టీడీపీ మౌనం వహించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.