హైదరాబాద్‌లో ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగిపోయిన చికెన్ ధర
- కిలో చికెన్ ధర రెండు రోజుల క్రితం రూ.257
- ఇప్పుడు కిలో చికెన్ ధర రూ.290
- వేసవిలో ఈ స్థాయిలో రేట్లు పెరగడం ఇదే తొలిసారి
హైదరాబాద్‌లో చికెన్ ధర మరింత పెరిగిపోయింది. గతంలో ఏ వేసవిలోనూ వినియోగదారులు ఎరగనంతగా కిలో చికెన్ ధర రెండు రోజుల క్రితం రూ.257కు చేరుకుని ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ధర మరింత పెరిగిపోయింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.290 పలుకుతుంది. ఆదివారం చికెన్ కొందామని మార్కెట్లోకి వచ్చిన ప్రజలు ధరల గురించి తెలుసుకుని విస్మయానికి గురవుతున్నారు.
వేసవిలో ఈ స్థాయిలో రేట్లు పెరగడం ఇదే తొలిసారని చికెన్ వ్యాపారులు తెలిపారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో వచ్చిన వదంతుల కారణంగా కొన్ని రోజుల క్రితం వరకు కోడి మాంసం ముట్టేందుకు బెదిరిపోయిన ప్రజలు ఇప్పుడు భారీగా ఎగబడుతున్నారు. కరోనా భయంతో నెల రోజుల క్రితం ఎన్నడూ లేనంతగా తగ్గిన చికెన్ ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో చికెన్ ముక్కలకు దూరమవుతున్నారు.