వీసా నిబంధనలు ఉల్లంఘన.. భోపాల్‌లో 60 మంది తబ్లిగీల అరెస్ట్
- వివిధ దేశాల నుంచి టూరిస్టు వీసాపై భారత్‌కు
- చట్టాన్ని ఉల్లంఘించి మతపరమైన కార్యక్రమాలు
- బెయిలు పిటిషన్ తిరస్కరణతో అరెస్ట్
పర్యాటక వీసాపై భారత్ వచ్చి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించారంటూ 60 మంది విదేశీ తబ్లిగీలను భోపాల్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. వీరిపై ఏడు కేసులు నమోదైనట్టు తెలిపారు. స్థానిక కోర్టులో వారు పెట్టుకున్న బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
అయితే, మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన కార్యక్రమానికి వారు హాజరైనదీ, లేనిదీ ఇంకా తెలియరాలేదన్నారు. కాగా, అరెస్ట్ అయిన తబ్లిగీలలో కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజక్‌స్థాన్, టాంజానియా, దక్షిణాఫ్రికా, మయన్మార్ దేశాలకు చెందిన వారు ఉన్నారని పోలీసులు తెలిపారు.