ప్రేమించే వాళ్లను హగ్ చేసుకుంటేనే చనిపోతామని ఎన్నడూ అనుకోలేదు: సానియా మీర్జా భావోద్వేగం
- వీడియో కాల్స్ తో తృప్తిగా లేదు
- షేక్ హ్యాండ్లు, ఆలింగనాల ప్రపంచం తిరిగి రావాలి
- మునుపటి జీవితం కోసం వేచి చూస్తున్నానన్న సానియా
ఎన్ని వీడియో కాల్స్ చేసుకున్నా, మనుషులతో కలిసి ఉన్నట్టుగా ఉండదని, మళ్లీ మునుపటిలా జీవితాన్ని ఎప్పుడు గడుపుతామోనని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగపు వ్యాఖ్యలు చేశారు. తన భర్త పాకిస్థాన్ లో ఉండగా, బిడ్డ ఇజాన్ తో కలిసి సానియా హైదరాబాద్ లోనే ఉండిపోయింది. తాజాగా, ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె, చిన్న పిల్లాడు ఉండటంతో తన పరిస్థితి మరింత కష్టంగా ఉందని, వాళ్ల నాన్నను ఇజాన్ మళ్లీ ఎప్పుడు చూస్తాడో తెలియడం లేదని వాపోయారు.
మనం ప్రేమించే వాళ్లను కౌగిలించుకుంటేనే చనిపోతామని ఎన్నడూ అనుకోలేదని, ఆలింగనాలు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకునే మామూలు ప్రపంచాన్ని తాను తిరిగి చూడాలని ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇంట్లోని చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న వేళ, వాళ్లను రక్షించుకోవడంపైనే దృష్టిని పెట్టి, ఎవరూ పని గురించి ఆలోచించడం లేదని చెప్పారు.
తను, ఇజాన్ షోయబ్ కు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉందని, అయితే, 65 ఏళ్ల తల్లికి ఇప్పుడు షోయబ్ అవసరం ఎంతైనా ఉందని, షోయబ్ అక్కడే ఉండటమే సరైనదని, త్వరలోనే మహమ్మారి సమసిపోయి, ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటకు వస్తామని వ్యాఖ్యానించారు.